కౌంటింగ్ లో మోసం… సుప్రీం కోర్టుకు వెళ్తాం
అమెరికా ఎన్నికల ఫలితాలు తుది దశకు వస్తున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారు. నేను సుప్రీం కోర్టుకు వెళ్తున్నా. ఎన్నికల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాలి. ఈ ఎన్నికలను మేమే గెలవబోతున్నాం. నిజంగా చెబుతున్నా మేమే గెలిచాం. చట్టాన్ని సరిగ్గా ఉపయోగించి ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఆపేయాలని కోరుతున్నాం అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో భారీ విజయోత్సవానికి సిద్దంగా ఉండాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు.






