Donald Trump: మళ్లీ పోటీ చేసే ప్రసక్తే లేదు: డొనాల్డ్ ట్రంప్

మూడో దఫా అధ్యక్ష బరిలోకి దిగకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump) నిర్ణయించుకున్నాన్నారు. మళ్లీ పోటీ చేసే ప్రసక్తే లేదని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ రెండో విడత అనంతరం వైట్‌హౌస్ (White House)ను వీడనున్నట్లు ధ్రువీకరించారు. తాను మొదలు పెట్టిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) ఉద్యమం మాత్రం కొనసాగుతుందన్నారు. దానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) , విదేశాంగ మంత్రి మార్కో రూబియా(Marco Rubia) వారసులని ప్రకటించారు. తాను పదవి నుంచి దిగిపోయాక వారికి అమెరికా సమాజం భారీగా మద్దతిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వాన్స్ అద్భుతమైన, తెలివైన వ్యక్తి. రూబియో గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు.