9/11 సంస్మరణ కార్యక్రమంలో… ఆసక్తికర సంఘటన
అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి ఘటన జరిగి 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమం నిర్వహించగా అందులో అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ట్రంప్ 2024 అని ఉన్న టోపీని బైడెన్ ధరించారు. సంస్మరణ కార్యక్రమానికి బైడెన్‌తో పాటు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ట్రంప్ 2024 అని ఉన్న టోపీని ట్రంప్ మద్దతుదారు ధరించారు. అది చూసిన బైడెన్ సరదాగా ఆ వ్యక్తితో సంభాషించి టోపీని తీసుకుని తలపై పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ ప్రతినిధి ఆండ్రూ బేట్స్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇది దేశ ఐక్యతకు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.






