అమెరికాలో హింసకు తావు లేదు : బైడెన్
డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరగడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదని బైడెన్ వ్యాఖ్యానించినట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ట్రంప్‌తో బైడెన్ స్వయంగా మాట్లాడినట్లు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసినట్లు వెల్లడించింది. కాగా వారాంతంలో భాగంగా డెలావెర్ బయలుదేరాల్సిన బైడెన్, ఈ ఘటనతో తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వివరించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ అద్యక్షులు ఒబామా, బిల్ క్లింటన్, బుష్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.






