అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి.. నిక్కీ హెలీ ఔట్!
అగ్రరాజ్య అధికార పీఠం కోసం జరిగే ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థులుగా ఉండటం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యరిత్వ రేసు నుంచి వైదొలగాలని భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సూపర్ ట్యూస్డే ప్రైమరీల పోరులో ఈమె దారుణంగా ఓడిపోయారు. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధులు మద్దతు కావాల్సి ఉంటుంది. నేటి ఫలితాల తర్వాత ట్రంప్‌నకు 995 మంది మద్దతు ఉండగా, హేలీ ఖాతాలో 89 మంది మాత్రమే ఉన్నారు. ట్రంప్‌తో పోలిస్తే భారీ వెనుకంజలో ఉన్న ఆమె పోటీని విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.






