డొనాల్డ్ ట్రంప్ కు షాక్…
ఇవాంకా ట్రంప్‌కి చెల్లించిన కన్సల్టింగ్ ఫీజుల రికార్డులను సమర్పించాల్సిందిగా న్యూయార్క్ అటార్నీ జనరల్ డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన సంస్థలకు నోటీసులు జారీ చేశారు. అధ్యక్షుడి వ్యాపార వ్యవహారాలపై పౌర విచారణలో భాగంగా నోటీసులిచ్చినట్లు న్యాయ విభాగం అధికారులు తెలిపారు. మరో క్రిమినల్ కేసు విచారణలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ కంపెనీకి మాన్హటన్ జిల్లా అటార్నీ నోటీసులు జారీ చేసినట్లు మీడియా వెల్లడించింది. తన కంపెనీకి చెందిన ఆదాయపన్నుని తగ్గించి, రూ.192 కోట్లను వ్యాపార ఖర్చు కింద చూపిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ చర్యలు తనపై వేధింపుల్లో భాగమేనని ఇవాంక ట్వీట్ చేశారు.






