Donald Trump : జెలెన్‌స్కీకి డొనాల్డ్ ట్రంప్ వరుస షాక్‌లు.. త్వరలో సౌదీలో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ యుద్దంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ నాటో (NATO) సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఆయన పుతిన్ (Putin)తో 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్‌కాల్‌లో మాట్లాడిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రష్యా అధినేత పుతిన్‌తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియా (Saudi Arabia)లో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడిరచారు. అలాగని ఈ భేటీలో భారీ జప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడిరచారు. ఇక శాంతి చర్చలు వెంటనే మొదలవుతాయని పేర్కొన్నారు. రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ (Ukraine) తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్ బాంబు పేల్చారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణల్లోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలు సన్నగిల్లాయి.