Elon Musk: అమెరికా కాంగ్రెస్ సభ్యుల జీతాలు పెంచాలి : మస్క్

అమెరికా చట్టసభ అయిన కాంగ్రెస్‌లో అవినీతిని కట్టడి చేయాలంటే సభ్యులకు జీతాలు (Salaries) పెంచాలని అమెరికా ప్రభుత్వ సామర్థ్య పెంపుదల విభాగం సారథి ఎలాన్ మస్క్ (Elon Musk) సలహా ఇచ్చారు. కాంగ్రెస్ (Congress ) సభ్యులు, సీనియర్ ఉద్యోగులు (Employees) అవినీతికి పాల్పడకుండా ఉండాలంటే వారికి చెల్లింపులను పెంచాలి. లేకపోతే ఇందుకు ప్రజలు 1000 రెట్లు మూల్యం చెల్లించాల్సి రావచ్చు అని మస్క్ అన్నారు. వాస్తవానికి చట్టసభ సభ్యులు ఏటా 1,74,00 డాలర్ల వేతనం పొందుతున్నారు. ఈ వేతనాన్ని చివరిసారిగా 2009లో పెంచారు.