Doze : డోజ్ లో మస్క్ ఉద్యోగి కాదు.. అధిపతి కాదు : వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనేక శాఖల్లో ఉద్యోగాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం తాత్కాలికంగా ఏర్పాటైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ లో ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్ష కార్యాలయం మరోసారి క్లారిటీ ఇచ్చింది. డోజ్ (Doze) లో మస్క్ ఉద్యోగి కాదు. అధిపతి కాదు. ట్రంప్ సలహాదారుడిగా ఆ బాధ్యత చూస్తున్నాడు. ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారాలు లేవని స్పష్టం చేసింది.
ఎలాన్ మస్క్ యూఎస్ డోజ్ సర్వీస్ ఉద్యోగి కాదు. వైట్‌హౌస్‌లో ఇతర సీనియర్ సలహాదారుల మాదిరిగానే స్వతహాగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అధికారం మస్క్‌కు లేదు అని కోర్టు ఫైలింగ్‌లో వైట్‌హౌస్ వ్యవహారాల డైరెక్టర్ జోషువా ఫిషర్ (Joshua Fisher ) పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ న్యూ మెక్సికో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఓ కేసుకు సంబంధించి వైట్‌హౌస్ (White House) ఈ వివరణ ఇచ్చింది.