NATO : నాటో నుంచి అమెరికా నిష్క్రమించాలి : మస్క్

నాటో (NATO) కూటమి నుంచి అమెరికా (America) నిష్క్రమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీనియర్ సలహాదారు మైక్ లీ (Mike Lee) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుకు డోజ్ అధిపతి ఎలాన్ మస్క్(Elon Musk) మద్దతు పలికారు. ఐరోపా దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే నాటో భవిష్యత్తుపై ఆ దేశాల్లో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.