Donald Trump : 1000 మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు!

అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విదేశీ విద్యార్థులపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన కొన్ని వారాల్లోనే 1000 మందికిపైగా విదేశీ విద్యార్థుల (Foreign students) వీసా లేదా చట్టబద్ధ హోదాలను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ట్రంప్ యంత్రాంగం తీరుపై అనేక మంది విద్యార్థులు న్యాయస్థానాల (Courts) ను ఆశ్రయిస్తున్నారు. వీసా రద్దు చేసే క్రమంలో పెడరల్ ప్రభుత్వం (Federal Government) సరైన రీతిలో వ్యవహరించడం లేదని వాదిస్తున్నారు.