క్యాపిటల్‌పై దాడి కలచివేసింది : మెలానియా
అమెరికా కాంగ్రెస్ భవనం క్యాపిటల్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేయడాన్ని ఆయన భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. గతవారం జరిగిన పరిణామం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. క్యాపిటల్‌పై దాడిని వ్యతిరేకిస్తున్నా. హింస ఎప్పుడూ ఆయోదయోగ్యం కాదు. ఈ ధోరణిని ఆందోళనకారులు విడనాడాలి. కొందరు ఈ విషాద ఘటన చుట్టా పుకార్లు పుట్టిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తూ, నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అని ఆమె వ్యాఖ్యానించారు. క్యాపిటల్‌పై దాడికి స్వయానా అధ్యక్షుడు ట్రంపే ఆందోళనకారులను పురికొల్పారన్న ఆరోపణలపై మాత్రం ఆమె స్పందించలేదు.






