Melania: ట్రంప్ విజయంలో బారన్ పాత్ర : మెలానియా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ గెలుపులో తమ కుమారుడు బారన్ ట్రంప్ (Barron Trump) కీలక పాత్ర పోషించారని కాబోయే ప్రథమ మహిళ మెలానియా(Melania) పేర్కొన్నారు. ఎన్నికల్లో యువతను ఆకట్టుకునేందుకు డొనాల్డ్నకు బారన్ ఎంతో తోడ్పడ్డారు. ప్రస్తుతం యువత టీవీ వంటి సంప్రదాయ మీడియా కంటే ఫోన్లు, పాడ్కాస్ట్లకే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని అతడు బాగా గుర్తించాడు. తన తండ్రి ఎవరిని సంప్రదించాలో ఎవరితో, ఎలా మాట్లాడాలో నా కుమారుడికి బాగా తెలుసు. అతడి సలహాలు, వ్యూహాలు ఫలించాయి అని మెలానియా పేర్కొన్నారు.






