మాజీ భార్యల కంటే మెలానియాకే ఎక్కువ
డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు భారీగానే భరణం అందనుంది. కాగా 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామని అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పినట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడించింది. ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు అని ఒమరోసా తెలిపారు. దాదాపు 500 కోట్లకు పైగా ఉంటుందని న్యాయనిపుణులు, న్యూమాన్ రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ చెప్పారు.
వారిద్దరికి 14 ఏళ్ల బారన్ ట్రంప్ సంతానం. కాబట్టి ఆమెకు అందే ప్రాథమిక కస్టోడియల్ హక్కులన్నీ లభిస్తాయని న్యూమాన్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌కు మెలానియా మూడవ భార్య. అయితే ట్రంప్ మాజీ భార్యల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందనుంది. మొదటి భార్యకు 14 మిలియన్ డాలర్లు, రెండవ భార్యకు 2 మిలియన్ డాలర్లను అప్పజెప్పగా తాజాగా మెలానియాకు మాత్రం 68 మిలియన్ డాలర్లు అందే అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.






