ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కసరత్తు : అమెరికా
భారత్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ప్రపంచంలో మరే దేశంతో పోల్చినా అతిపెద్ద ఎన్నికలుగా అమెరికా ప్రశంసించింది. భారత్లో జరిగిన ఎన్నికలను మేము ఆస్వాదించాం. చరిత్రలో ఇది అతి పెద్ద కసరత్తు అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాకు వెల్లడించారు. అధికార పార్టీ బీజేపీలో ముస్లిం సభ్యుల ప్రాతినిధ్యం ఏమాత్రం లేకపోవడంతో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అది భారత ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అంశమని పేర్కొన్నారు. భారత ఎన్నికల ఫలితాలపై తాను వ్యాఖ్యలు చేయడం లేదని మిల్లర్ స్పష్టం చేశారు.






