కమలా హారిస్ గెలిస్తే శ్వేతసౌధంలో.. కర్రీ వాసనలే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ ( కూర) వాసనలతో నిండి పోతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమలా భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది అని లూమర్ పేర్కొన్నారు.






