కరోనా టాస్క్ ఫోర్స్ లో భారతీయుడు ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ ప్రకటించబోయే కరోనా టాస్క్ ఫోర్స్ కు కో చైర్మన్‌గా భారత సంతతికి చెందిన అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని నియమిస్తారని తెలుస్తోంది. కర్ణాటటకు చెందిన మూర్తి(43)ని అమెరికా 19వ సర్జన్ జనరల్‌గా అప్పటి (2014) అధ్యక్షుడు ఒబామా నియమించారు. బ్రిటన్‌లో పుట్టిన వివేక్ మూర్తి 37 ఏళ్ల వయసులోనే సర్జన్ జనరల్‌గా నియమితులై రికార్డు సృష్టించారు. అయితే తర్వాత వచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఆయనను వైదొలగాలని కోరింది. విల్మింగ్టన్, డెలావర్‌లో బైడెన్ ఇచ్చిన విక్టరీ స్పీచ్‌లో నేను శాస్త్రవేత్తలు, నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాను. వారు బైడెన్- హారిస్ కొవిడ్ ప్లాన్‌ను బ్లూప్రింట్‌గా మార్చడానికి కృషి చేస్తారు. అది జనవరి నుంచి అమలులోకి వస్తుందని అని అన్నారు.






