అమ్మమ్మ, తాతయ్యలే స్ఫూర్తి … కమలా హారిస్
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తన అమ్మమ్మ, తాతయ్యలను గుర్తు చేసుకున్నారు. గ్రాండ్ పేరెంట్స్ డేను పురస్కరించుకొని బాల్యంలో తన అమ్మమ్మ, తాతయ్యలకు సంబంధించిన ఆసక్తి కర విషయాలను వెల్లడిరచారు. బాల్యంలో ఓసారి భారత్లోని అమ్మమ్మ, తాతయ్యలను కలిసేందుకు వెళ్లాను. తాతయ్య ఓ విశ్రాంత సివిల్ సర్వెంట్. నన్నూ తనతో ఉదయపు నడకకు తీసుకెళ్లేవారు. ఆ సమయంలో సమానత్వం, అవినీతిపై పోరాటం వంటివాటి ప్రాధాన్యాన్ని వివరించేవారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. అమ్మమ్మ కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కుటుంబ నియంత్రణపై మహిళలకు అవగాహన కల్పించేవారు. ప్రజాసేవ పట్ల వారి నిబద్ధత, మంచి భవిష్యత్తు కోసం చూపిన పోరాట స్ఫూర్తే నన్ను నడిపిస్తున్నాయి. భవిష్యత్తు తరాలకు తీర్చిదిద్దే, అందరికీ స్పూర్తిగా నిలిచే బామ్మలు, తాతయ్యలకు గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు అని తెలిపారు.






