అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఆధిక్యంలో కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సర్వేల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. తాజాగా న్యూయార్క్ టైమ్స్, సియానా కళాశాల సంయుక్తంగా స్వింగ్ రాష్ట్రాల్లో ( విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగన్) సర్వే నిర్వహించాయి. ఇందులో హారిస్ 4 పాయింట్ల ఆధిక్యంతో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ముందంజలో ఉన్నట్లు తెలింది. ఆగస్టు 5, 9 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో మూడు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు 46 శాతం, హారిస్‌కు 50 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడైంది.






