అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా…ముందంజలో కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ప్రజాదరణ కమలా హారిస్‌కే కాస్త అధికంగా ఉన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలను నిర్ణయించే కీలక రాష్ట్రాల్లో మాత్రం నువ్వా నేనా అన్న పరిస్థితి ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్బీఎస్ న్యూస్ సంస్థ తాజాగా 1,000 మది రిజిస్టర్డ్ ఓటర్లతో సర్వే నిర్వహించింది. ఇందులో 49 శాతం మంది కమలకు, 44 శాతం మంది ట్రంప్‌నకు అనుకూలంగా ఓటు వేస్తామని తెలిపారు. సర్వేలో 5 పర్సంటేజ్ పాయింట్ల వరకు హెచ్చుతగ్గులు ఉండవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. దాంతో కమలవైపు కాస్త మొగ్గు కనిపిస్తున్నా ఫలితాలను అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. సీబీఎస్/ఐపోస్ సంస్థ 3,129 మంది రిజిస్టర్డ్ ఓటర్లతో సర్వే జరిపింది. ఈ సర్వే కూడా కమలకే అనుకూలంగా ఉంది. అవెకు 52శాతం మంది, ట్రంప్‌నకు 48 శాతం మంది మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఫలితాలను నిర్ణయించే ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో కమలా హారిస్‌కు కాస్త మొగ్గు ఉన్నట్టు సర్వేల్లో కనిపిస్తున్నా వాస్తవానికి తీవ్రమైన పోటీ నెలకొంది.






