ట్రంప్ నిలకడలేని మనిషి : కమలా హారిస్ విమర్శ
డొనాల్డ్ ట్రంప్ నిలకడలేని మనిషని, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉంటారని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విమర్శించారు. తనతో ఏకీభవించని సొంత ప్రజలపైనే అమెరికా సైన్యాన్ని ప్రయోగించే వ్యక్తి అని ధ్వజమెత్తారు. వాషింగ్టన్ డీసీలోని ఎలిప్స్లో ఆమె తన చివరి భారీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛకు` అల్లర్లు, విభజన వాదానికి మధ్య జరుగుతున్నాయని 60 ఏళ్ల హారిస్ వ్యాఖ్యానించారు. తన ప్రత్యర్థులను ప్రాసిక్యూట్ చేసేందుకు జాబితాను ట్రంప్ తయారు చేసుకున్నారని, కాపిటల్ హిల్‌పై దాడి చేసిన అతివాదులకు స్వేచ్ఛ కల్పించేందుకూ ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. ఇది సరికొత్త నాయకత్వానికి బాటలు వేసే ఎన్నికని వ్యాఖ్యానించారు.






