ట్రంప్‌ను ఓడించడమే లక్ష్యం : కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని ట్రంప్ ముందస్తుగా ప్రకటించుకుంటే సవాలు చేయడానికి తన టీం సిద్ధంగా ఉందని, ఆయనను ఓడించడంపైనే తాను ప్రస్తుత దృష్టి పెట్టానని డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో లింగ వివక్ష పని చేస్తుందన్న ఆందోళన తనలో లేదని తేల్చి చెప్పారు. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. బైడెన్ సమర్థంగా పని చేస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలను అడ్డుకునే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ప్రజల అభిప్రాయాలను గౌరవించని నేత. అమెరికాలోని క్యాపిటల్ హిల్పైనే దాడి చేయించిన వ్యక్తి అని హారిస్ విమర్శించారు. తన అభ్యర్థిత్వంపై చరిత్రలోకి వెళ్లబోనని, తాను మహిళనని, ఎవరినీ తప్పుబట్టబోనని, తన అభ్యర్థిత్వానికి లింగ వివక్షవల్ల ఇబ్బంది లేదని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేవారిని, స్ఫూర్తినందించే వారినే ప్రజలు ఎన్నుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.






