మరోసారి డిబేట్కు ట్రంప్ అంగీకరించాలి : కమలా హారిస్
సీఎన్ఎన్ వేదికగా జరగబోయే డిబేట్కు తాను సిద్ధమని, ట్రంప్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని డెమోక్రటిక్ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ట్రంప్ కూడా డిబేట్కు వచ్చేందుకు అంగీకరించాలి. అమెరికా ప్రజల కోసం ఆయన పాల్గొనాలి. ఎన్నికల ముందు ఒకసారి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడాలి. మరోసారి చర్చించేందుకు నేను ఎదురుచూస్తున్నా. కానీ, ప్రత్యర్థి మాత్రం తప్పించుకొనేందుకు కారణాలను వెతికే పనిలో ఉన్నారు అని న్యూయార్క్ సిటీలో ఓ ఫండ్ రైజర్ కార్యక్రమంలో హారిస్ వ్యాఖ్యానించారు.






