హారిస్ బృందం విరాళాలు… 540 మిలియన్ డాలర్లు
ఎన్నికల ప్రచారం కోసం డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 540 మిలియన్ డాలర్లు సేకరించారు. చికాగోలో జరిగిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో కమలా హారిస్, ఉపాధ్యక్ష అభ్యర్థి మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తమ నామినేషన్లను ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా, కన్వెన్షన్లో హారిస్ అంగీకార ప్రసంగానికి ముందు 500 మిలియన్ డాలర్ల మార్కును దాటామని ప్రచాక కమిటి తెలిపింది. ఆమె ప్రసంగించిన వెంటనే ఫండిరగ్ పెరిగిందని వెల్లడిరచింది. కన్వెన్షన్లో జరిగిన వారంలో మూడిరటు ఒక వంతు విరాళాలు మొదటిసారి దాతల నుంచి వచ్చాయని డిల్లాన్ తెలిపారు. మొదటిసారి దాతలయిన వారిలో ఐదో వంతు యువ ఓటర్లు, మూడిరట రెండొంతులు మహిళలు ఉన్నారంది.






