అమెరికా కోసమే బైడెన్ ఈ నిర్ణయం : కృష్ణమూర్తి
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న బైడెన్ ఎండార్స్మెంట్ డెమోక్రటిక్ పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని ఇండో`అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి ఈ ఎన్నికలను గెలిచే అవకాశం పార్టీకి లభించిందని పేర్కొన్నారు. అమెరికా జాతిని ఏకం చేయడం కోసమే బైడెన్ ఈ నిర్ణయం తీసుకొన్నారని అభిప్రాయపడ్డారు. ట్రంప్‌తో చర్చలో పేలవ ప్రదర్శన తర్వాత ఆయన తీసుకొన్న నిర్ణయం సముచితమైందని పేర్కొన్నారు. కమలా హారిస్ తరపున ప్రచారం చేయాలని కృష్ణమూర్తి నిర్ణయించుకొన్నారు. ఆమె క్షేత్రస్థాయిలో అడుగుపెట్టారు. ప్రజలు ఆమెను అభినందించారు. శ్వేత సౌధాన్ని గెలిచే అవకాశం మాకు లభించింది. ట్రంప్‌ను ఓడిరచగలిగే వ్యక్తి లభించారు. ఈ విషయంలో కమలా కంటే సమర్థవంతమైన వ్యక్తి మరొకరు లేరు అని అన్నారు.






