డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఊరట.. 2020 నాటి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు కేసుల విషయంలో భారీ ఊరట లభిస్తోంది. తాజాగా 2020 నాటి ఎన్నికల కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌పై ఉన్న 2020 నాటి ఎన్నికల కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ అంగీకరించారు. కేసును తొలగించడం సముచితం. ఈ తీర్పు అధ్యక్షుడు పదవిలో ఉన్నంత వరకు మాత్రమే. ఆ బాధ్యతల నుంచి వైదొలగిన వెంటనే తీర్పు గడువు ముగుస్తుంది అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఈ కేసులు చట్టవిరుద్ధమైనవి. మాపై పోరాడేందుకు ప్రత్యర్థులైన డెమోక్రాట్లు పన్ను చెల్లింపుదారుల సొమ్ము 100 మిలియన్ డాలర్లు వృథా చేశారు. ఇంతకు ముందు అమెరికాలో ఇటువంటి జరగలేదు అని అన్నారు.






