తప్పని తెలిసీ కూడా డొనాల్డ్ ట్రంప్ సంతకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బోగస్ ఓట్లను కూడా లెక్కించారనే ఆరోపణ అసత్యమని తెలిసి కూడా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఆరోపణలతో కూడిన కేసు పత్రాలపై సంతకం చేశారని జిల్లా కోర్టు జడ్జి డేవిడ్ కార్టర్ నాటి తన రూలింగులో పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో నిజానికి ట్రంప్ గెలిచినా జో బైడెన్‌ను విజేతగా ప్రకటించారని ఆరోపిస్తూ ట్రంప్ మద్దతుదారులు 2020 జనవరి 6న అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) భవనం క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేశారనే ఆరోపణపై అమెరికా న్యాయశాఖ విడిగా జరుపుతున్న విచారణను ఈ రూలింగు నేరుగా ప్రభావితం చేయకపోయినా పరోక్షంగా ఉపకరించవచ్చు.






