అమెరికా అధ్యక్ష పీఠం జో బైడెన్ దే
అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జో బైడెన్‌కు లైన్ క్లియరైంది. ఎన్నికల్లో ఆయన గెలిచినట్లు ప్రకటించిన ఎలక్టోరల్ కాలేజ్ ఫలితాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారికంగా ధృవీకరించింది. క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ బైడెన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ హింస తర్వాత తిరిగి సమావేశమైన కాంగ్రెస్‌ను వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ప్రారంభించారు. ఆ తర్వాత సభ్యులు ఎలక్టోరల్ ఓట్లను లెక్కించి, బైడెన్ ఎన్నికను ధవృకరించారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ.. దీనిని అమెరికా క్యాపిటల్ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించిన ట్రంప్.. చివరి నిమిషం వరకూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తన మద్దతుదారులను రెచ్చగొట్టి క్యాపిటల్ హిల్‌పై దాడికి ఉసిగొల్పారు.






