Joe Biden: ఆయన వల్లే అణు ఒప్పందం సాధ్యమైంది : జో బైడెన్
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (manmohan singh) మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడు, గొప్ప ప్రజా సేవకుడు అంటూ కొనియాడారు. మన్మోహన్ సింగ్ ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు. అద్భుతమైన ప్రజా సేవకుడు. ఆయన వ్యూహాత్మక దృక్పథం లేకుంటే భారత్-అమెరికా మధ్య అపూర్వమైన సహకారం సాధ్యమయ్యేదే కాదు. చారిత్రాత్మకమైన భారతదేశం అమెరికా పౌర అణు ఒప్పందం (Civil nuclear agreement) నుంచి ఇండో-పసిఫిక్ భాగస్వాముల కోసం క్వాడ్‌ను ప్రారంభించడం వరకూ ఆయన కృషి మరవలేనిది అంటూ పేర్కొన్నారు. జో బైడెన్, జిల్ బైడెన్ (Jill Biden ) మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలియజేశారు.






