త్వరలో బైడెన్, జిన్ పింగ్ భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ త్వరలో సమావేశం కాబోతున్నారు. నవంబర్ నెలాఖరులో కీలక సమావేశం జరగనుంది. శాన్ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి ( ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు సందర్భంగా బైడెన్, జిన్‌పింగ్ భేటీ అవుతారు. ఈ మేరకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జీన్ పెర్రీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీలో ఇజ్రాయెల్ హమాస్ యుద్దం అంశం చర్చకు వస్తుందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతిస్తుండగా, చైనా పాలస్తీనీయులుకు మద్దతుగా నిలవడం విశేషం.






