నాటకాలాపండి.. ముమ్మాటికీ నేనే అభ్యర్థిని
డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానేనని జో బైడెన్ పునరుద్ఘాటించారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గత నాటకాలు, వదంతులను ఇక కట్టిపెట్టాలన్నారు. బరి నుంచి తాను వైదొలగాలని డిమాండ్ చేస్తున్న దాతలు, కొందరు డెమోక్రాట్ సభ్యులకు ఆయన రెండు పేజీల లేఖ రాశారు. తన విషయంలో వీరు వ్యక్తపరుస్తున్న ఆందోళనలు ఏమిటనేది తెలుసుకున్నానని, వాటినేమీ గాలికి వదిలేయలేదని స్పష్టం చేశారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడిరచేందుకు తానే ఉత్తమం అనే గట్టి నమ్మకంతో ఉన్నానని, అలాంటి విశ్వాసం లేకపోతే ఎన్నికల గోదాలోకే దూకేవాడిని కానని చెప్పారు. బరిలో తాను ఉన్నానని, వెనుదిరిగిపోయేదే లేదని తేల్చి చెప్పారు.






