బైడెన్ వైదొలగేదే లేదు : శ్వేతసౌధం
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలను తావిచ్చిన నేపథ్యంలో అధ్యక్ష కార్యాలయం మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. బైడెన్ తప్పుకొనే ప్రశ్నే తలెత్తదన్నారు. బరిలో ఉంటున్న విషయాన్ని తాజాగా ప్రచారంలోనూ ఆయన స్పష్టం చేశారని కరీన్ గుర్తు చేశారు. ప్రచారాన్ని నిలిపివేసి రాజీనామా చేసే ఉద్దేశమేదీ ఆయనకు లేదని, బాధ్యతల్ని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించే చర్చలేమీ జరగలేదని ఖండిరచారు.






