ట్రంప్‌ను అలా అనడం తప్పే : బైడెన్
తనపై విమర్శలు ఆపి ఇకనుంచి రిపబ్లికన్ల నేత డొనాల్డ్ ట్రంప్‌పై తీక్షణంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎన్నికల ప్రచారంలో తాను చెప్పడం తప్పేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ట్రంప్ ఒక ముప్పుగా మారారని చెప్పడంలో భాగంగా తాను అలా అనాల్సి వచ్చిందని తెలిపారు. ట్రంప్‌పై దాడికి బైడెన్ విమర్శలే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో బైడెన్ స్పందించారు. అందరూ ఆరోపిస్తున్నట్లుగా ట్రంప్‌పై దాడి చేయాలనడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తనను ట్రంప్ అంతకంటే తీవ్రమైన పదజాలంతో విమర్శించారని గుర్తు చేశారు. బైడెన్ గెలిస్తే రక్తపాతమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వివిధ అంశాల్లో రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్, ట్రంప్ ఒకే తరహా వ్యక్తులని పెదవి విరిచారు.






