డబ్ల్యూహెచ్‌వో లో చేరతాం… బైడెన్
తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి ప్రపంచ ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యూహెచ్‌వో)లో చేరుతామని అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్ సృష్టం చేశారు. అయితే, డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలు అవసరమన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ శిక్షించడంపై కన్నా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చైనాకు అవగాహన కల్పించడం ముఖ్యం అని చెప్పారు. ఇతర దేశాలతో కలిసి చైనాకు అవగాహన కలిగించేందుకు యత్నిస్తామని చెప్పారు. పారిస్ పర్యావరణ ఒప్పందంలో కూడా మరలా చేరతామన్నారు. అమెరికా, చైనా సంబంధాలు ట్రంప్ హయాంలో బాగా దెబ్బతిన్నాయని తెలిపారు.






