జో బైడెన్ నిర్ణయం.. టార్గెట్ పూర్తి చేసుకున్న అమెరికా
తమ దేశంలోని కనీసం 70 శాతం వృద్ధులకు ఒక్క డోస్ వ్యాక్సిన్‌ను పూర్తి చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించిన టార్గెట్‌ను ఓ నెల ఆలస్యంగా చేరుకోగలిగారు. అయితే, హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనాను కట్టడి చేయాలనుకున్న ఆయన ఆశలు ఫలించలేదు. డెల్టా వేరియంట్‌తో ఆ దేశంలో మరోసారి కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్పత్రులు కరోనా పేషెంట్లతో నిండిపోతున్న దుస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. దాంతో, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వ్యాక్సిన్లు వేయించుకోవాలంటూ పలు రాష్ట్రాల్లో నిబంధనలు విధిస్తున్నారు.






