తీర్పును అంగీకరించాల్సిందే .. ప్రశాంతంగా అధికార మార్పిడి
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రశాంతంగా అధికార మార్పిడి జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. ప్రజల తీర్పును అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. నేను ట్రంప్‌తో మాట్లాడా. శుభాకాంక్షలు తెలిపా. నా మొత్తం అధికార వ్యవస్థ ఆయనతో కలిసి పనిచేసి ప్రశాంతంగా అధికార మార్పిడికి సహకరిస్తుందని చెప్పా. 200 ఏళ్లకు పైగా అమెరికా స్వయం పాలిత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. అమెరికాలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని మరోసారి నిరూపితమైంది. హారిస్ స్ఫూర్తిదాయకమైన ప్రచారం చేశారు. ఆమెకు గొప్ప వ్యక్తిత్వముంది అని బైడెన్ పేర్కొన్నారు.






