జో బైడెన్ వైపే అంటున్న సర్వేలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై నిర్వహించిన చాలా సర్వేలు రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి. ఇక తాజాగా వెలువడిన సీఎన్ఎన్ పోల్స్ ఫలితాల్లో బైడెన్ ఏకంగా 10(పది శాతం) పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించింది. సీఎన్ఎన్ పోల్స్ ప్రకారం బైడెన్‌కు 52 శాతం, ట్రంప్ 42 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తెలిసింది. సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్ పోల్స్ కూడా ట్రంప్‌తో పోలిస్తే.. బైడెన్ 8 నుంచి 10 పాయింట్ల అధిక్యంలో కొనసాగుతున్నట్లు వెల్లడించాయి. ఫాక్స్ న్యూస్ కూడా బైడెన్‌దే పైచేయి అని తేల్చేయడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ సర్వే పోల్స్‌లో బైడెన్ కంటే ట్రంప్ 8 పాయింట్లు వెనుకంజలో ఉన్నట్లు తేలింది. కాగా, 2016 అధ్యక్ష ఎన్నికల పోల్స్ ఫలితాలతో పోలిస్తే ఈసారి బైడెన్‌కు మద్దతు కాస్తా ఎక్కువగా ఉంది. ఇక న్యూయార్కస్ టైమ్స్ ప్రకారం ఒకవేళ ప్రీ పోల్స్ నిజమైతే.. బైడెన్ భారీ విజయం సాధించడం ఖాయం అని స్పష్టం చేసింది.






