ట్రంప్ అంటేనే అంతర్జాతీయ నేతలకు భయం : బైడెన్
డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్ష పదవి చేపడతారేమోనన్న భయం అంతర్జాతీయ నేతల్లో ఉందని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యానికి ఏమైనా అవుతుందేమోనన్న ఆందోళన వారిలో ఉందని పేర్కొన్నారు. నా పత్రి అంతర్జాతీయ పర్యటనలోనూ ఇలాంటి ఆందోళనే వ్యక్తమైంది. ఇటీవల జర్మనీలో జరిగిన సదసుసకు వెళ్లినప్పుడు ఇదే విషయం ప్రస్తావించారు. నన్ను పక్కకు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ట్రంప్ గెలవకూడదని చెప్పారు. తమ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డారు అని బైడెన్ వివరించారు.






