ఆయుధాల లైసెన్స్ మరింత కఠినతరం …
అమెరికాలో ప్రాణాంతక ఆయుధాల లైసెన్స్ సమస్యను సవరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పార్లమెంటుకు సూచించారు. మరీ తీవ్రమైన ప్రమాదమున్న ఆయుధాలను నిషేధించాలని పిలుపునిచ్చారు. మూడేండ్ల క్రితం పార్క్‌ల్యాండ్ ఊచకోతను స్మరించుకుంటూ జో బైడెన్ ఆయుధాల లైసెన్స్‌ను మరింత కఠినతరం చేయడం గురించి సూచనలు చేశారు. 2018 లో ఫ్లోరిడా ప్రావిన్స్‌లోని పార్క్‌ల్యాండ్‌లోని మార్జోరీ స్టోన్మెన్ డగ్లస్ హైస్కూల్లో ఒక దుండగుడు రివాల్వర్‌తో కాల్చాడు. ఈ కాల్పుల్లో 14 మంది పిల్లలతో పాటు మొత్తం 17 మంది చనిపోయారు. ఈ బాధాకరమైన సంఘటన జరిగినప్పటి నుంచి ఆయుధాల లైసెన్స్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
పార్క్‌ల్యాండ్ ఊచకోతను గుర్తుకు తెచ్చుకుంటూ అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన అనంతరం చాలా మంది తల్లిదండ్రులు, టీనేజర్లు ఆయుధ చట్టాన్ని సంస్కరించడానికి న్యాయవాదులుగా మారారు. ఆయుధాలను కలిగి ఉండే హక్కు అమెరికా రాజ్యాంగంలోని రెండవ సవరణ ద్వారా రక్షించబడింది. తుపాకీల ఆమ్మకాలకు సంబంధించి అధిక క్యాలిబర్ ఆయుధాల లైసెన్సులను మంజూరు చేయడాన్ని నిషేధించాలని జో బైడెన్ సూచించారు. తూపాకీ తయారీదారులకు చట్టపరమైన ఇమ్యూనిటీని ఇవ్వడాన్ని కూడా నిషేధించాలని పిలుపునిచ్చారు.






