కాలిఫోర్నియా కోర్టుకు జో బైడెన్ అభ్యర్థన… ఆ పిటిషన్ ను
భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ తహవ్వుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం కాలిఫోర్నియా కోర్టును కోరింది. ఆరుగురు అమెరికన్లతో పాటు 166 మందిని బలిగొన్న 2008 నాటి ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రేమయం ఉన్న ఇతడిని భారత్కు అప్పగించాలని పునరుద్ఘాటించింది. పాకిస్థాన్ మూలాలు ఉన్న 62 ఏళ్ల కెనడా వ్యాపారవేత్త తహవ్వుర్ రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రాణా అరెస్టును కోరుతూ భారత్ 2020 జూన్ 10న అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఇందుకు కోర్టు అంగీకరించి అనుమతి ఇచ్చింది. భారత్కు తనను అప్పగించాలన్న కోర్టు అనుమతిని సవాలు చేస్తూ రాణా హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేశాడు.






