Jinping: జిన్‌పింగ్ చాలా స్మార్ట్ … సుంకాల నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Jinping)ను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆ దేశ దిగుమతులపై 125 శాతం టారిఫ్‌లు (Tariffs) విధిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఈ సందర్భంగా సుంకాలపై బీజింగ్ (Beijing) అమెరికాతో ఓ ఒప్పందం కుదుర్చుకోవాలని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వైట్‌హౌస్ (White House) లో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్‌పింగ్ గురించి కూడా తెలుసు. ఈ సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు అక్కడి ( చైనా) నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ట్రంప్ పేర్కొన్నారు.