డొనాల్డ్ ట్రంప్ కు బంపర్ ఆఫర్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలై త్వరలో పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్ ప్రణాళికలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియదుకానీ, ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం పురపాలక శాఖ మాత్రం తమ సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చంటూ ట్రంప్‌నకు సూచించింది. ఈ మేరకు ఉద్యోగాల వెబ్సైట్ లింక్‌తో తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. డొనాల్డ్ ట్రంప్‌నకు విజ్ఞప్తి.. మీరు దిగులుపడాల్సిన అవసరం లేదు. జెరూసలెం జాబ్ బోర్డు రోజూ అమూల్యమైన ఉద్యోగావకాశాలను ప్రకటిస్తుంది అని ఆ పోస్టులో వ్యాఖ్యలు కనిపించాయి. ఇది సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ సంస్థ ఆ పోస్టును తొలగించింది. అనుకోకుండా ప్రచురితమైందని, వెంటనే తొలగించామని పురపాలక సంస్థ ప్రతినిధి వెల్లడించారు.






