అయోవాలో ట్రంప్ జయభేరి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి ప్రైమరీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అయోవాలో జరిగిన ఓటింగ్‌లో 51 శాతం మంది రిపబ్లికన్ పార్టీ ప్రతి నిధులు ఆయనకు మద్దతిచ్చారు. ఇది గతంలో అయోవా చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీ. మిగిలిన అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో లేరు. మాజీ అధ్యక్షుడైన 77 ఏళ్ల ట్రంప్‌నకు అయోవాలో 51 శాతం ఓట్లు వచ్చాయి. 21.2 శాతం ఓట్లతో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ రెండో స్థానంలో నిలిచారు. 19.1 శాతం ఓట్లతో ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మూడో స్థానం దక్కించుకున్నారు.













