అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన 6.2 కోట్ల మంది
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగమైన ముందస్తు ఓటింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ఇప్పటికే దాదాపు 6.2 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిసింది. ముందుస్తు ఓటింగ్ ప్రక్రియలో అనేకమంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లగా, మరికొంత మంది మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇటీవల డెలావేర్లోని విల్మింగ్టన్లో తన ఇంటి సమీపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యంలో నవంబరు 5న ప్రధాన పోలింగ్ జరుగుతుంది.






