మిచిగన్‌లో మిలియనీర్ విజయం
రెండేళ్ల క్రితం మిచిగన్ గవర్నర్ పదవి కోసం పోటీపడిన డెమోక్రటిక్ మిలియనీర్ థానేదార్ తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎన్నికయ్యారు. ఆయనకు 93 శాతం ఓట్లు పోలయ్యాయి. 65 ఏళ్ల థానేదార్ వృత్తి రీత్యా శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. ప్రైమరీ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆయన సుమారు 4 లక్షల డాలర్ల రికార్డు ఫండ్‌ను సేకించారు. 2018లో ఆన్ ఆర్బర్ నుండి ఓడిపోయిన ఆయన.. ఈసారి డెట్రాయిట్ నుంచి పోటీ చేశారు. మిచిగన్ రాష్ట్రంలోని మూడవ జిల్లా నుంచి ఆయన విజయం సాధించారు.
గవర్నర్ పోటీ కోసం థానేదార్ సుమారు కోటీ డాలర్లు ఖర్చు చేశారు. థానేదార్ స్వస్థలం కర్నాటకలోని బెల్గామ్. కెమిస్ట్రీలో ఆయన 18 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేశారు. బాంబే వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చదివారు. 1979లో ఆయన అమెరికా వలస వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్రన్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో ఆయన ఉన్నత చదువులు పూర్తి చేశారు. పేదరికం గురించి తనకు తెలుసు అని, తమ జిల్లాల్లో ఆ సమస్యలను పరిష్కరించనున్నట్లు థానేదార్ చెప్పారు.






