భారతీయ అమెరికన్లలో హారిస్‌కు తగ్గిన ఆదరణ!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదుకబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది. భారత మూలాలున్న కమలా హారిస్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్‌కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్‌నకు 22శాతం మాత్రమే జైకొట్టారు.






