అమెరికా విదేశాంగ శాఖలో భారతీయుడు
అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై ప్రతిరోజూ పాత్రికేయులకు వివరించే విశేష బాధ్యతను చేపట్టిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌గా వేదాంత్ పటేల్ చరిత్ర సృష్టించారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ సెలవుల్లో ఉండటంతో ఆయన బాధ్యతలను 33 ఏళ్ల వేదాంత్ పటేల్ విజయవంతంగా నిర్వహించి వైట్ హౌస్ అధికారుల ప్రశంసలు పొందారు.
ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ అణు సమస్య, బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నిక తదితర కీలక పరిణామాలపై వేదాంత్ పటేల్ పాత్రికేయులకు అమెరికా వైఖరిని చక్కగా వివరించారు. ప్రపంచ రంగస్థలంపై అమెరికా ప్రతినిధిగా వ్యవహరించడమనే బృహత్తర బాధ్యతను పటేల్ ఎంతో నైపుణ్యంగా నిర్వహించారని వైట్‌హౌస్ ఉన్నతాధికారి మ్యాట్ హిల్ పేర్కొన్నారు. గుజరాత్ నుంచి అమెఇకా వలస వెళ్లిన పటేల్ గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ తరపున పని చేశారు.






