ఇజ్రాయెల్ లో జరిగింది ..అమెరికాలోను జరగొచ్చు
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని భారత సంతతి అమెరికన్లు ముక్తకంఠంతో ఖండిరచారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ, వివేక్ ఇందులో ఉన్నారు. ఇజ్రాయెల్, అమెరికాలను అంతం చేయాలని హమాస్, దాని మద్దతుదారైలన ఇరాన్ ప్రభుత్వం పిలుపునిస్తూన్నాయని హేలీ గుర్తు చేశారు. హమాస్, హెజ్బాల్లా, హౌతీలు, వారికి అండగా నిలిచే ఇరానియన్లు, మనల్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇజ్రాయెల్ తరపున అమెరికా గట్టిగా నిలవాలని హేలీ అన్నారు. ఇజ్రాయెల్‌లో జరిగింది అమెరికాలోనూ జగరవచ్చని హెచ్చరించారు. తన సరిహద్ధులను కాపాడుకోవడంలో ఇజ్రాయెల్ విఫలమైనందునే హమాస్ దాడి చేయగలిగిందని, అమెరికా ఉత్తర దక్షిణ సరిహద్దులూ చొరబాట్లకు అనువుగా మారడం ఆందోళనకమని మరో రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి పేర్కొన్నారు.






