America: ఇది భారత్‌పై ప్రతీకారం తీర్చుకునే సమయం : అమెరికా

వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలను విధిస్తోందని, ఇతర దేశాలూ విధించే సుంకాలతో అమెరికా (America) వస్తువులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందని అధ్యక్ష భవనం శ్వేతసౌధం (White House) స్పష్టం చేసింది. ప్రతీకార సుంకాలకు సమయమొచ్చిందని అభిప్రాయపడిరది. భారత్ (India) సహా అనేక దేశాలపై బుధవారం నుంచి ప్రతీకార సుంకాలను అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ (Trump) నిర్ణయించారు. అందుకే దానిని లిబరేషన్ డే గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ (Caroline Leavitt) మాట్లాడారు. దురదృష్టవశాత్తూ చాలా దేశాలు చాలా కాలంగా అమెరికాను దోచుకున్నాయి. అమెరికా కార్మికుల పట్ల వారి వ్యతిరేక ధోరణి స్పష్టంగా ఉంది. ఒక్కసారి ఈ అనుచిత వాణిజ్య విధానాలను చూడండి. అమెరికా పాల ఉత్పత్తులపై ఐరోపా దేశాలు 50 శాతం సుంకాలను విధిస్తున్నాయి. మా బియ్యంపై జపాన్ (Japan) 700 శాతం సుంకాలను అమలు చేస్తోంది. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలను వసూలు చేస్తోంది. అమెరికా బటర్, చీజ్‌పై కెనడా 300 శాతం సుంకాలను విధిస్తోంది. వీటివల్ల మేం వ్యాపారం చేయలేకపోతున్నాం. పలువురు అమెరికన్లు తమ వ్యాపారాలను మూసి వేయాల్సి వస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోంది అని లీవిట్ పేర్కొన్నారు.