బైడెన్ కు ఇండో అమెరికా వ్యాపారుల విజ్ఞప్తి
హెచ్-1బీ వీసాల మంజూరులో కఠిన ఆంక్షలను సడలించాలని భారత-అమెరికా వ్యాపారవేత్తల బృందం త్వరలోనే అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌ను కోరింది. ఈ మేరకు వ్యాపారవేత్తల ప్రతినిధుల బృందం బైడెన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. దేశంలో ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను తగ్గించడానికి హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు సడలించాలని, సైన్స్, మ్యాథ్స్‌లో పీహెచ్డీ చేసే విద్యార్థులకు గ్రీన్ కార్డులు మంజూరు చేయాలని కోరినట్టు యూఎస్ ఇండియా స్ట్రాటెజిక్ అండ్ పార్ట్‌నర్‌షిఫ్ ఫోరం అధ్యక్షుడు ముఖేశ్ అగి తెలిపారు. సానుకూలంగా స్పందించిన బైడెన్..హెచ్-1బీ వీసాలపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.






